నాగశౌర్య మేనత్త కూడా ఒక స్టార్ నటి అని తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరోల లిస్టులో ముందు వరసలో ఉంటాడు నాగశౌర్య. నాగశౌర్య పేరెంట్స్ కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగశౌర్య మేనత్త కూడా యాక్టర్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఈమె చాలా కాలంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Senior Actress Latha Sri about hero Naga Shourya నాగశౌర్యకి సినీ  బ్యాగ్రౌండ్ నేనే అంటున్న మేనత్త!

ఇక అసలు విషయంలోకి వెళ్తే నాగశౌర్య మేనత్త పేరు లత శ్రీ .నాగశౌర్య తండ్రికి ఈమె సొంత చెల్లెలు యమలీల చిత్రంలోని అభివందనం యమరాజ అంటూ సాగే పాటలు ఈమె డాన్స్ వేసింది.. ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు, నెంబర్ వన్, జంబలకడిపంబ వంటి హిట్టు చిత్రాలులో కూడా నటించింది పలు దక్షిణాది భాషలలో సుమారుగా 50కు పైగా సినిమాలలో నటించింది. ఆ తరువాత ఒక జిమ్ ట్రైనర్ను ఈమె ప్రేమించి మరి వివాహం చేసుకుంది దీంతో తిని ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేసింది లతాశ్రీ.

అయితే 2007లో ఈవివి దర్శకత్వంలో వచ్చిన అత్తిలి సత్తిబాబు సినిమాతో రీ ఎంట్రి ఇచ్చింది. కానీ నాగశౌర్య ఫ్యామిలీకి, శ్రీలత ఫ్యామిలీకి మధ్య మాటలు లేవట. ఇరువురు ఫ్యామిలీలో చిన్న గొడవలు ఉన్నట్లుగా సమాచారం. అయితే దీనికి కారణం ఏంటనే విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు. నాగశౌర్య వివాహ వేడుకలలో కూడా పెద్దగా కనిపించలేదు. ఈమె అయితే ఈమెకు అల్లుడు నాగశౌర్య అంటే చాలా ఇష్టమట ఆయన సినిమాలు కూడా చూస్తుందని సమాచారం. ప్రస్తుతం నాగశౌర్య నారి నారి నడుమ మురారి పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలలో నటిస్తున్నారు