దసరా సినిమా సక్సెస్ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ చిత్రం దసరా. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి నిరంతరం వార్తల్లోనే నిలుస్తూనే ఉంది. ఈ సినిమా విడుదల పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో బాగానే ఆకట్టుకుంది. దీంతో అభిమానులు కూడా ఈ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Dasara Box Office: Nani's Film Has Already Recovered The Cost & A 12 Crore  Profit Even Before Its Release? Here's What We Know!
తాజాగ ఈ సినిమా విడుదల కాకముందే ఒక సూపర్ రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఒక్క ఏరియాలోని రూ.6 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. నాని కెరియర్ లోనే ఇప్పటివరకు ఏ చిత్రానికి కూడా ఈ రేంజ్ లో బిజినెస్ జరగలేదని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు రైట్స్ రెండు నెలల ముందుగానే చదలవాడ శ్రీనివాస్ రూ.24 కోట్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక మరింత హైపోవచ్చాగా దిల్ రాజు ఆయన దగ్గర నుంచి రూ.28 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ కొట్టాలి అంటే రూ.29 కోట్లు వస్తేనే సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో అనిల్ తడాఖా వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా తీసుకున్నట్లు సమాచారం కర్ణాటకలో KRG కేరళ నుంచి E4E ఓవర్సీస్ PHARS అన్నిచోట్ల కూడా డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగారని తెలుస్తోంది మరి నాని సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.