బాక్సాఫీస్ వ‌ద్ద `సార్‌` బీభ‌త్సం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్రం `సార్‌`. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త హీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా బీభ‌త్సం సృష్టిస్తోంది.

మొత్తంగా రూ. 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ప‌ది రోజులు పూర్తి అయ్యే స‌మ‌యానికి రూ. 44.65 కోట్ల షేర్‌, రూ. 86.01 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుని దుమ్ము దులిపేసింది. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఈ సినిమా ఏకంగా రూ. 8.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ సార్ ప‌ది రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

తమిళనాడు – 29.45 కోట్లు
తెలుగు రాష్ట్రాలు – 28.41 కోట్లు
కర్ణాటక – 6.80 కోట్లు
కేరళ – 0.95 కోట్లు
రెస్టాప్ ఇండియా – 1.00 కోట్లు
ఓవర్సీస్ – 19.41 కోట్లు
————————————————
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్‌ కలెక్షన్లు = 86.01 కోట్లు గ్రాస్‌(44.65కోట్ల‌~ షేర్)
————————————————

Share post:

Latest