కమెడియన్ గీత సింగ్.. ఇంట విషాదం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది లేడీ కమెడియన్స్ వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది నటి గీతా సింగ్. మొదట అల్లరి నరేష్ నటించిన కితకితలు వంటి సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న గీతా సింగ్ ఆ తర్వాత ఎవడి గోల వాడిదే, సీమశాస్త్రి తదితర చిత్రాలలో నటించి బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటించిన ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది గీతా సింగ్.

comedian geeta singh, Geeta Singh: రూ. 6 కోట్లు మోస‌పోయాను.. న‌మ్మినవాళ్లే  డ‌బ్బు కోసం.. లేడీ క‌మెడియ‌న్ గీతా సింగ్ ఆవేద‌న‌ - actress geeta singh  emotional interview - Samayam Telugu
అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలను పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఇప్పటికే ఎన్నో కష్టాలను పడుతున్న గీత తాజాగా తను దత్తత తీసుకున్న కుమారుడు మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రోడ్డు ప్రమాదంలో కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ కావడంతో తను దత్తత తీసుకున్న కుమారుడు మరణించినట్లుగా తెలుస్తోంది.

ఇక గీతా సింగ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే జీవిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అన్న కుమారులను ఆమె దత్తకు తీసుకున్నట్లు సమాచారం. వారితోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.కానీ ఇప్పుడు చనిపోయిన గీతా సింగ్ కుమారుడు పేరు వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ గీతా సింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించింది. ఇప్పటివరకు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న గీతా సింగ్కు తన కుమారుడిని కోల్పోవడంతో పలువురు సినీ ప్రముఖుల సైతం సంతాపాన్ని తెలుపుతున్నారు.

Share post:

Latest