బాబు-సాయిరెడ్డి మంతనాలపై కొత్త చర్చ.!

టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఇద్దరు నేతలు రాజకీయంగా బద్ధశత్రువులు. అసలు విజయసాయి ఏ స్థాయిలో చంద్రబాబు, లోకేష్ లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తారో తెలిసిందే. దారుణమైన పదజాలం వాడుతూ తిడతారు. అంటే ఏ స్థాయిలో రాజకీయ శతృత్వం ఉందో చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా శతృత్వం ఉన్నా..ఫ్యామిలీ పరంగా బంధుత్వం ఉంది. విజసాయిరెడ్డి..నందమూరి తారకరత్న వాళ్ళ వైఫ్‌కు బాబాయి అవుతారు.

అంటే తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డి తల్లి, విజయసాయి భార్య అక్కాచెల్లెళ్ళు. అటు తారకరత్న తండ్రి మోహనకృష్ణ, చంద్రబాబు భార్య భువనేశ్వరి..అన్నాచెల్లెలు అవుతారు. అంటే తారకరత్నకు ఇటు చంద్రబాబు, అటు విజయసాయి రెడ్డి మావయ్యలు అవుతారు. టోటల్ చూసుకుంటే బాబు-విజయసాయి అన్నదమ్ముల వరుస ఉంది. కానీ అది రాజకీయాల్లో కనిపించలేదు. తీవ్రంగా తిట్టుకునేవారు. కానీ తాజాగా తారకరత్న మరణించడంతో బాబు-విజయసాయి కలిశారు.

తారకరత్న మరణించడంతో ఆయనకు నివాళి అర్పించి విజయసాయి అక్కడే ఉంటూ..వచ్చిన వారిని పకలరిస్తూ కనిపించారు. మొదట ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తర్వాత చిరంజీవి, బాలయ్యలతో మాట్లాడారు. ఇదే క్రమంలో చంద్రబాబుతో సైతం అరగంటపాటు మాట్లాడారు. అలాగే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా విజయసాయి పక్కనే ఉన్నారు. చంద్రబాబు వెళ్ళేవరకు పక్కనే ఉన్నారు. అసలు రాజకీయంగా చాలా దూరం ఉండే వీరు..ఇప్పుడు అరగంట సేపు మాట్లాడటంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఏదైనా ఫార్మాలిటీ ప్రకారం పలకరించుకోవడం కామన్..ఏదో రెండు, మూడు నిమిషాలు మాట్లాడుకుంటారు. కానీ బాబు-విజయసాయి అలా చేయలేదు. బంధువులు కాబట్టే అంతసేపు తారకరత్న గురించి మాట్లాడుకున్నారని అంటున్నారు. మొత్తానికైతే బాబు-సాయిరెడ్డి కలవడం పెద్ద హాట్ టాపిక్ అయింది.