జోగి నాయుడు పై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్..!

ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ గత ఎన్నికలలో భాగంగా తన పార్టీ కోసం కృషి చేసిన వారికి ఇప్పుడు పెద్ద ఎత్తున పదవులు కట్టబెడుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన అలీ, పోసాని ,మంగ్లీ వంటి వారికి కీలక పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ విజయానికి తమ వంతు కృషి చేసిన కమెడియన్ జోగి నాయుడుకి కూడా వైసిపి పదవి కట్టబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన జోగినాయుడు వైసీపీ పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోని వైసీపీ ప్రభుత్వం జోగి నాయుడుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియమించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ స్పందించారు..

బండ్ల గణేష్ తన ట్వీట్ ద్వారా” జగన్ గారిని నమ్ముకున్నందుకు జోగి నాయుడుకి పదవి వచ్చింది.. ఆల్ ది బెస్ట్ తమ్ముడు ” అంటూ ట్వీట్ చేశారు . ఇలా బండ్ల గణేష్ ట్వీట్ చేయడంతో జనసేన నాయకులు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.. అంతేకాదు ఈ ట్వీట్ గురించి పలువురు జనసేన నాయకులు స్పందిస్తూ.. త్రివిక్రమ్ నిన్ను ఎందుకు దూరం పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. నువ్వు రంగులు మార్చే ఊసరవెల్లి.. నిన్ను దూరంగా పెట్టడమే మంచిది.. అంటూ పవన్ కళ్యాణ్ కి సూచనలు కూడా ఇస్తున్నారు.

Share post:

Latest