తనని కూడా కమిట్మెంట్ అడిగారని షాకింగ్ కామెంట్స్ చేసిన అషు రెడ్డి..!!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రాణించాలని కల అందరికీ ఉంటుంది కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఇప్పటి జనరేషన్లో మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో వస్తున్న వారికి ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ ఎదురవుతుందని విషయం గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. కానీ మీటు ఉద్యమం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఈ క్యాస్టింగ్ విషయం మీద మాట్లాడడం జరిగింది. తమకు జరిగిన కొన్ని అనుభవాలను కూడా కొంతమంది పడుకోవడం జరిగింది .

Ashu reddy, దెబ్బకు రక్తం కారిపోయిందట!.. ఆవేశపడ్డ అషూ రెడ్డి.. పోస్ట్ వైరల్  - ashu reddy finger bleeding by opening gift packs - Samayam Telugu
అయితే కొంతమంది మాత్రం అసలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదు అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన అషు రెడ్డి కూడా స్పందించింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటిటి ద్వారా పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.అషు రెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూల మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది కానీ అది మనం ప్రవర్తించే తీరును బట్టి ఉంటుందని తెలియజేస్తోంది.

మొదట తనకు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైందని నన్ను కూడా ఒక డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారు కానీ నేను తప్పించుకున్నాను అని తెలియజేసింది అషు రెడ్డి. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తోని అవకాశాలు అందుకున్నానని కానీ కొంతమంది మాత్రం క్యాస్టింగ్ కోచ్ కి బలైపోయారని తెలియజేస్తోంది. మరి కొంతమంది చేజేతులారా తమ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారని అషు రెడ్డి వాపోతోంది. ప్రస్తుతం ఇమే చేసిన కామెంట్లు కాస్త వైరల్ గా మారుతోంది.

Share post:

Latest