నెక్స్ట్ స్టార్ హీరోయిన్లు వారేనా..?

టాలీవుడ్ లో ప్రతి దశాబ్దంలో కూడా ఖచ్చితంగా ఇద్దరు నుంచి ముగ్గురు స్టార్ హీరోయిన్ల హవా బాగా నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఒకసారి స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ఏర్పడిందంటే చాలు దాదాపుగా వారి సినీ కెరియర్ కు ఎలాంటి డోకా ఉండదని చెప్పవచ్చు. వరుసగా స్టార్ హీరోలందరితో కూడా జతకట్టే అవకాశాలు ఉంటాయి. గత రెండు దశాబ్దాలలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన వారిని చేసుకున్నట్లయితే.. నయనతార ,అనుష్క త్రిష, కాజల్ తమన్నా, రకుల్, సమంత ,పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి వారి పేర్లు వినిపిస్తూ ఉంటాయి.

Mrunal Thakur Silent- Sreeleela Violent మృణాల్ సైలెంట్-శ్రీలీల వైలెంట్
మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్స్ గా తమ కెరియర్ను కొనసాగించారని చెప్పవచ్చు.ఇప్పటికీ ఇందులో కొంతమంది హీరోయిన్స్ హీరోయిన్ గానే చేస్తూ ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి వివాహం కాలేదు. ఈ నేపథ్యంలోని నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోయిన్లు అయ్యే అవకాశం టాలీవుడ్ లో ఎవరికి ఉందనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి వారి లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల, మృణాల్ ఠాగూర్. వీరిద్దరూ హీరోయిన్స్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నది.

ప్రస్తుతం నానికి జోడిగా ఒక చిత్రంలో నటిస్తున్నది. దీంతోపాటు నాగార్జున హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో కూడా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా ఫిక్సయినట్లు తెలుస్తోంది.. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు హిందీలో కూడా పలు కమర్షియల్ చిత్రాలలో నటిస్తోంది ఇక తర్వాత హీరోయిన్ శ్రీ లీల ఇటీవలే ధమాకా చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా నితిన్ తో ఒక సినిమా రామ్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే ఈ బ్యూటీ మూడేళ్ల పాటు గ్యాప్ లేకుండా సినిమాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ దశాబ్దంలో టాలీవుడ్ లో మృణాల ఠాగూర్, శ్రీ లీల హవ కచ్చితంగా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Share post:

Latest