సోముకు సెగలు..ఇంకా సైడ్ చేసేస్తారా?

ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు బయటపడుతూనే ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా సొంత నేతలే గళం విప్పుతున్నారు. ఇంతకాలం అసంతృపతి గళం పెద్దగా వినిపించలేదు..కానీ ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ నేత పార్టీని వీడటంతో పార్టీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సోము వీర్రాజు వైఖరి నచ్చకే పార్టీని వీడినట్లు కన్నా చెప్పారు. దీంతో పార్టీలో ఉన్నవారు సైతం సోము పై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.

కన్నా వర్గాన్ని పూర్తిగా సైడ్ చేసుకొచ్చిన కన్నా..పరోక్షంగా వైసీపీకి మద్ధతు ఇస్తున్నారని, అటు ఎంపీ జి‌వి‌ఎల్ సైతం అదే చేస్తున్నారని, అందుకే బీజేపీ బలోపేతం కావడం లేదని..కొందరు బి‌జే‌పి నేతలు వ్యతిరేకంగా గళం విప్పడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అక్కడ మురళీధరన్ నేతలకు సర్ది చెప్పి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పంపారు. ఆ వెంటనే ఆయన ఏపీకి వచ్చారు. ఇక ఆయన రావడమే తరువాయి..నేతలు వరుసపెట్టి సోముపై ఫిర్యాదులు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు నేతలు..పార్టీలో ఎస్సీ, మైనారిటీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు.

ఈ పరిణామాలతో ఏపీ బి‌జే‌పిలో రచ్చ పెరుగుతుంది..ఇదే పరిస్తితి కొనసాగితే సోముని అధ్యక్ష పదవి నుంచి దించేస్తారనే ప్రచారం మొదలైంది. కానీ సోము విషయంలో అధిష్టానం అప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ సోము వైఖరి..టి‌డి‌పితో పొత్తు లేకపోవడం లాంటి అంశాల వల్ల కొందరు నేతలు బి‌జే‌పిని వీడటం గ్యారెంటీగా కనిపిస్తోంది.

ఇప్పటికే కొందరు కీలక నేతలు టి‌డి‌పిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. కన్నా టి‌డి‌పిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే కీలక నేతలు జంప్ చేస్తారని తెలుస్తోంది.

Share post:

Latest