సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం.. చైల్డ్ యాక్టర్ మృతి..!!

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన రెండు రోజుల క్రితం కే విశ్వనాథ్ గారు మృతి చెందగా.. నిన్నటి రోజున ప్రముఖ సింగర్ వాణి జయరామ్ మృతి చెందడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక చైల్డ్ యాక్టర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Child Artist Sinchana Death Parents File Case On Doctors - Sakshiఅసలు విషయంలోకి వెళ్తే తన నటన ప్రతిభతో సినీ ప్రేక్షకులను అలరించిన తారలు ఒక్కొక్కరు లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ సించన అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. వాంతులు విరోచనాలు కారణంగా ఆసుపత్రిలో చేర్పించగా ఈమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు తెలియజేశారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఈమె పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల తన కూతురు చనిపోయిందని సంచన తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయకురారని ఆందోళన చేయబడుతున్నారు బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

సంచన వయసు 15 సంవత్సరాలు 10వ తరగతి మాత్రమే చదువుతోంది. ఒకవైపు చదువుతూనే మరొకవైపు దుస్తుల దుకాణంలో పనిచేస్తోందట .అలాగే పలు సినిమాలలో జూనియర్ డాన్సర్ గా ,చైల్డ్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంచన కొద్దిరోజుల క్రితం వాంతులు విరోచనాలకు గురైనట్లుగా తెలుస్తోంది.దీంతో వెంటనే ఆమెను బెంగళూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తలరించినట్లు సమాచారం. అక్కడ వైద్యులు ఆమెకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారట .అయినప్పటికీ ఆమె కోలుకోలేక చికిత్స పొందుతూ నిన్నటి రోజున చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈమె అభిమానుల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Share post:

Latest