మరొకసారి అలాంటి వీడియోతో డేటింగ్ ని నిజం చేసిన సిద్ధార్థ్-అదితి..!!

టాలీవుడ్ లో కూడా నటుడు గా సిద్దార్థ్ బొమ్మరిల్లు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి లవర్ బాయ్గా కూడా పేరు పొందారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మహాసముద్రం సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా పలు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

Aditi Rao Hydari dances with rumoured boyfriend Siddharth, video goes viral  | Bollywood News

త్వరలో వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఆమధ్య ఎక్కువగా వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ ఫంక్షన్లకు పార్టీలకు, పబ్బులకు వెళ్లిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకలలో కూడా వీరిద్దరూ కలిసి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక దీంతో వీరిద్దరి మధ్య లవ్ కన్ఫామ్ అని పలు రకాలుగా కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు అలాంటి వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా సిద్దార్థ్, అదితి ఇద్దరు కలిసి డాన్స్ చేసినటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.

వీరిద్దరూ కలసి ఎంతో హుషారుగా స్టెప్పులేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో సుమారుగా 3.5 లక్షలకు పైగా లైకులు రావడం జరిగినట్లు తెలుస్తోంది. ఇక వీరి వీడియోకు హన్సిక, దియా మీర్జా తదితర సెలబ్రిటీలు సైతం తమదైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. త్వరగా మీ లవ్ ని అనౌన్స్మెంట్ చేయండి అంటూ పలు రకాలుగా కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు .మరి త్వరలోనే వీరి బంధాన్ని అధికారికంగా ప్రకటించి వివాహం చేసుకొని అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Share post:

Latest