లిప్ లాక్ సీన్స్ లో అందుకే న‌టించా.. అనిఖా బోల్డ్ కామెంట్స్‌!

అనిఖా సురేంద్రన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్టార్ హోదాను అందుకున్న అనిఖా.. రీసెంట్ గా టాలీవుడ్ లో విడుద‌లైన `బుట్టబొమ్మ‌` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే అనిఖా హీరోయిన్ గా న‌టించిన రెండో `ఓ మై డార్లింగ్`. ఈ సినిమాకు ఫ్రెడ్ డి శామ్యూల్ దర్శకత్వం వహించాడు. యాష్ ట్రీ వెంచర్స్ బ్యానర్‌పై మనోజ్ శ్రీకాంత నిర్మిస్తున్నారు. ఇందులో మెల్విన్ జి బాబు, అనిఖా జంట‌గా న‌టించారు. ముఖేష్, లీనా, జానీ ఆంటోని, మంజు పిళ్లై త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

అయితే ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్ లో అనిఖా లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి న‌టించింది. రెండో సినిమాకే హ‌ద్దులు దాటేసింద‌ని చాలా మంది ఆమెను ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఈ విష‌యంపై అనిఖా స్పందించింది. `ఓ మై డార్లింగ్ ను కంప్లీట్ గా రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించారు. ఇందులో ముద్దు సీన్లు కచ్చితంగా ఉండాల్సిందే. అవి లేకుంటే సినిమాలో ఫీల్ మిస్ అవుతుంది. దర్శకుడు తనకు స్క్రిప్ట్‌ చెప్పేటప్పుడు సన్నిహిత సన్నివేశాల ఇంపార్టెన్స్ కూడా చెప్పాడు. అందుకే ఈ సీన్స్ లో న‌టించా. ఈ సీన్లలో ఎలాంటి అశ్లీలత కనిపించదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ విషయం అర్థం అవుతుంది` అంటూ అనిఖా బోల్డ్ కామెంట్స్ చేసింది.

Share post:

Latest