అనసూయ- రష్మీ లలా ఆ పని చేయలేను..జబర్దస్త్ యాంకర్..!!

ఈటీవీలో పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది నటి సౌమ్యరావు.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. జబర్దస్త్ లో వచ్చే ఒక్కో ఎపిసోడ్ కు ఈమె రూ.80,000 రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. జబర్దస్త్ షో ద్వారా సౌమ్య మంచి పాపులారిటీ అందుకుంది ఇతర ఈవెంట్లలో కూడా ఈమె సందడి చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.సౌమ్య వేసే పంచులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని నేటిజన్లు తెలియజేస్తున్నారు.

Soumya Rao: రష్మీ ప్లేస్ లో జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన సౌమ్య రావు ఎవరు? -  OK Telugu

ఈటీవీలో భలే మంచి రోజు అనే ఈవెంట్లో పాల్గొన్న ఈమె తన మొదటి స్టేజ్ షో అని చెప్పుకొచ్చింది. ఈ షోలో చాలా ఫన్నీగా మాట్లాడిన మాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. జబర్దస్త్ షో మేకర్స్ తన గురించి తెలుసుకొని ఫోన్ చేశారని సౌమ్యారావ్ తెలిపింది. తనకు కాల్ వచ్చే సమయానికి జబర్దస్త్ అంత పెద్ద షూ అన్న విషయం తనకి తెలియదని తెలిపింది. యాంకర్ గా చేస్తారా అని కాల్ రాగా నేను మొదట ఎవరు కావాలని ఫ్రాంక్ చేశారనుకున్నాను ఆ తర్వాత నిజంగానే మల్లెమాల టీం నుంచి కాలు వచ్చిందని అర్థమైందని తెలిపింది సౌమ్య.

Anasuya and Rashmi Gautham team up for web series
ఆ తరువాత నాకు తెలుగు రాదని నేను చెప్పానని అయిన నా తెలుగు ప్రెట్టి గా ఉందని ఆడిషన్ కు రావాలని తెలిపారట. నాలుగు కాస్ట్యూమ్స్ లో నన్ను టెస్టు చేశారని తెలిపింది సౌమ్యరావు.. కెమెరా ముందు నవ్వమని అడగగా నేను నవ్వాలని తెలిపింది. రష్మీ,అనసూయ సూపర్ గా డాన్స్ చేస్తారని వాళ్ళ లాగా డాన్స్ చేయలేనని తెలిపింది సౌమ్యరావు. ఆ తర్వాత నాకు జబర్దస్త్ లో అవకాశం ఇచ్చారని తెలిపింది. అలా ప్రస్తుతం డాన్స్ నేర్చుకుంటూ ఉన్నానని త్వరలో మంచి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇస్తానని కూడా తెలిపింది సౌమ్యరావు.

Share post:

Latest