మాతృత్వంపై అలియా భట్ ఆసక్తికర కామెంట్స్..!

ప్రముఖ నటి అలియా బట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు అలరించింది. ఇటీవలే ఒక బిడ్డకి జన్మనిచ్చిన అలియా బట్ మాతృత్వ మాధుర్యాన్ని రుచి చూసింది. తన కూతురితో సంతోషమైన క్షణాలను గడపడం కోసం సినీ కెరీర్ కి సంబంధించిన కట్టుబాట్లను పక్కన పెట్టేసింది.

న్యూస్ మీడియా వారితో అలియా బట్ మాతృత్వం గురించి, తన కూతురు రాహ, ఆమె జీవితంలోకి వచ్చిన మధురానుభూతి గురించి తాజాగా వెల్లడించింది. అలియా మాట్లాడుతూ.. ‘కేవలం పిల్లల్ని కనడమే అతి పెద్ద సవాలు, కానీ కష్టమైన సమయం అని చెప్పను, మనిషి జీవితంలో ప్రతిరోజు సవాలే!! మీరు నన్ను మాతృత్వం గురించి చెప్పమన్నపుడు నాకు ఆకాశంలో కనపడే నక్షత్రాలు, స్వచ్ఛమైన సూర్యకాంతి లానే కల్మషం లేని ప్రేమ గుర్తు వచ్చాయి. నా కూతురుతో గడుపుతున్న క్షణాలే నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు. నా కూతురు చేసే ప్రతి ఒక్క పనిని నేను చాలా విశేషం గా చూస్తాను. నాకు అన్ని తెలుసు అని నేను అనుకోను. ఎప్పుడూ నేను ఎదుటివారిని చూసి నేర్చుకుంటున్న ఉంటాను ‘ అని చెప్పారు.

ఇకపోతే అలియా భట్ రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటించింది. అయితే చెర్రీ, అలియా మధ్య పెద్దగా రొమాంటిక్ సన్నివేశాలు ఏవీ సినిమాలో లేవు. ఈమెకు ఈ సినిమాతో పెద్దగా పేరు వచ్చిందే లేదు. భవిష్యత్తులో ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తెలుగు సినిమాలో నటిస్తుందో లేదో చూడాలి.

Share post:

Latest