తొలిసారి బేబీ బంప్ రివిల్ చేసిన పూర్ణ.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ తాజా ఫోటోలు!

న‌టి పూర్ణ.. అసలు పేరు షామ్నా కాసిం. కేర‌ళ‌లో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. మ‌ల‌యాళ సినిమాల‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత శ్రీమహాలక్ష్మి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అవును, అవును 2 వంటి చిత్రాల‌తో ఇక్క‌డ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

స్టార్ హీరోల సినిమాలు ప‌డి ఉంటే.. పూర్ణ కెరీర్ ఎక్క‌డికో వెళ్లేది. కానీ, చిన్న చిత‌క చిత్రాలు ప‌డ‌టం వ‌ల్ల పూర్ణకు స్టార్ హోదా ద‌క్క‌లేదు. అయితే సౌత్ లోని అన్ని భాష‌ల్లో సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న స‌మ‌యంలోనే పూర్ణ పెళ్లి పీటలెక్కింది.

దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీను గ‌త ఏడాది పూర్ణ పెళ్లి చేసుకుంది. వివాహం అయిన కొద్ది నెల‌ల‌కే పూర్ణ గ‌ర్భం దాల్చింది.

మ‌రి కొద్ది రోజుల్లోనే పూర్ణ త‌ల్లి కాబోతోంది. ఇటీవ‌లె పూర్ణ సీమంతం ఘ‌నంగా జ‌రిగింది. అయితే తాజాగా పూర్ణ తొలిసారి బేబీ బంప్ ను రివిల్ చేసింది. లైట్ పింక్ క‌ల‌ర్ ఫ్రాక్ లో అందంగా ముస్తాబై.. బేబీ బంప్ ను చూపిస్తూ క్యూట్ క్యూట్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. నెటిజ‌న్లు పూర్ణ తాజా ఫోటోల‌పై క్యూట్‌, స్వీట్ అంటూ ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest