బేబీ బంప్ తో పూర్ణ క్యూట్ ఫోజులు.. తాజా పిక్స్ చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు!

మోస్ట్ టాలెంటెడ్ అంటూ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ పూర్ణ త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఈ అమ్మ‌డు దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఏడ‌డుగులు వేసింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ ముంబైలో ఘ‌నంగా వివాహం చేసుకున్నారు.

పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌లకే పూర్ణ గ‌ర్భం దాల్చింది. ఇటీవ‌ల పూర్ణ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇక‌పోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ.. తరచుగా తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ క‌ల‌ర్ శారీలో బేబీ బంప‌ర్ తో క్యూట్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. పూర్ణ తాజా పిక్స్ చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు. ఎందుకంటే, అంత అందంగా ఆమె క‌నిపిస్తోంది. ఇక పూర్ణ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. నాని `దసరా` సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ పూర్ణ చేతిలో ఉన్నాయి. మ‌రోవైపు ప‌లు టీవీ షోల‌కు జ‌డ్జ్ గా సైతం వ్య‌వ‌హ‌రిస్తోంది.

https://www.instagram.com/p/CoFJ9EkBayY/?utm_source=ig_web_copy_link