నా భ‌ర్త వ‌ల్లే సినిమాల‌కు దూరం అయ్యా.. ల‌య ఓపెన్ కామెంట్స్‌!

ఒకప్ప‌టి నటి లయ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే `స్వయంవరం` మూవీతో లయ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే కెరీర్ పిక్స్ కు వెళ్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని అనూహ్యంగా సినిమాలకు దూరమైంది.

అయితే సినిమాలు మానేయడానికి తన భర్తే కారణమంటూ తాజాగా లయ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ల‌య‌.. తన వ్యక్తిగత జీవితం పాటు సినీ కెరీర్ కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంది. `మంచి క్రేజ్ వచ్చిన త‌ర్వాత నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. అలాంటి టైమ్ లో చాలా బాధ క‌లిగింది. సినిమాలు చేయవద్దని మా వారు ఎప్పుడూ అనలేదు.

కానీ, వివాహం త‌ర్వాత మా వారు యూఎస్‌లో ఉండేవారు.. షూటింగ్స్ వ‌ల్ల నేను ఇండియాలో ఉండాల్సి వ‌చ్చింది. ఇండియాకు, యూఎస్‌కు త‌ర‌చూ ప్ర‌యాణించ‌డం చాలా క‌ష్టమైంది. అందుకే మావారి కోసం సినిమాలు చేయ‌డం మానేశాను. ఇక ప్రస్తుతం నేను చేస్తున్న రీల్స్, నా ఫోటోలు అన్నీ కూడా మా వారే తీస్తారు. నా భ‌ర్త అన్ని ర‌కాలుగా న‌న్ను స‌పోర్ట్ చేస్తారు.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ల‌య కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest