అస్వస్థకు గురైన నటుడు ప్రభు..!!

సీనియర్ నటుడు ప్రభు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీలో ప్రభాస్ తండ్రిగా నటించి బాగా పాపులర్ అయ్యారు.ఆ తర్వాత ఎంతోమంది హీరోల సినిమాలలో కూడా నటించారు ప్రభు. తాజాగా ఈ నటుడు అస్వస్థకి గురైనట్లుగా తెలుస్తోంది. వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభు గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభుకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కిడ్నీలోని రాళ్ళను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా కూడా వైద్యులు తెలియజేశారు. అయితే రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా కూడా చెన్నై మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల సైతం కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఈయన అభిమానులు త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నారు. మరొకవైపు ప్రభు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యుల్ని కొంతమంది సినీ ప్రముకులు సైతం అడిగి తెలుసుకుంటున్నారు.

South Actor Prabhu Hospitalised Due to Kidney Issues - Sakshi
హీరో విజయ్ దళపతి నటించిన వారిసు చిత్రంలో ప్రభు కూడా నటించారు. తమిళనాడు తిలకం శివాజీ గణేష్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అరుగుపెట్టారు. బాలా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రభు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలు వచ్చిన షంగిలి అనే చిత్రంతో హీరోగా నటించారు. మొదటి సినిమాతోనే నటుడుగా పేరు సంపాదించిన ప్రభు ఒకానొక సమయంలో హీరోగా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం పలు చిత్రాలలో సహాయ నటుడు పాత్రలో నటిస్తున్నారు. ఆరోగ్యం బాగుందని తెలుసుకొని కాస్త అభిమానులు కుదుటపడ్డారు.

Share post:

Latest