శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి ఇమే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇటీవల వార్తలు వినిపించాయి. అతడికి పెద్దలు కుదిర్చిన వివాహం నిశ్చయమైందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ శుభవార్తను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి తండ్రి పేరు మధుసూదన రెడ్డి.. ఈయన హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారట. ఈయన కూతురు రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. రక్షిత కు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tollywood star Sharwanand to marry an NRI, here's when the wedding will  happen
రాజకీయ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి స్వయాన మనవరాలు ఈమెనట.. ఈమె మేనమామ గంగిరెడ్డి బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి అల్లుడు. ఇక దీంతో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కుటుంబ సభ్యులతో పెళ్లి తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అభిమానుల ఇది మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది. ఇటీవల వర్షం సినిమా దర్శకుడు కుమారుడు సంతోష్ శోభ నటించిన కళ్యాణం కమనీయం చిత్రంలో పూర్తిగా పెళ్లిని వ్యతిరేకించడానికి అతిథి పాత్రలో అలరించే ప్రోమో ఆకట్టుకుంది. ఇంతలోనే ఇప్పుడు శర్వా నంద్ పెళ్లి తేదీని ప్రకటించబోతున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శర్వానంద్ శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో అతిథిగా నటించారు. రామ్ చరణ్ కూడా బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్ కు ఇక తన ఇంట్లో పెరిగిన అబ్బాయి కావడంతో హీరోగా శర్వానంద్ ఎదగడం తనకు చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ పలు సందర్భాలలో తెలియజేశారు. మరి శర్వానంద్ వివాహానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి మరి.

Share post:

Latest