పెళ్లి వద్దు అంటూనే.. ప్రియుడిని పరిచయం చేసిన స్టార్ హీరోయిన్..!

మలయాళం ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి అమ్ము, పోనియన్ సెల్వన్, మట్టి కుస్తీ సినిమాలతో మంచి పేరును సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు సౌత్ సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈమె తన సోషల్ మీడియాలో నటుడు అర్జున్ దాస్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అర్జున్‌తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్ ను జోడించింది.

ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు కొందరు ఆమెకు కంగ్రాట్స్ చెపుతుంటే మరికొందరు మాత్రం.. ఇది ఏ సినిమా కోస‌మో చేస్తున్న ప్రమోషన్ స్టంట్ అంటూ తీసి పడేస్తున్నారు. త్వరలోనే ఇద్దరు ఏదైనా ఒక కొత్త సినిమాలు కలిసి నటిస్తున్నారేమో అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అర్జున్ దాస్ తో మాస్టర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.

Aishwarya Lekshmi and Arjun Das, Aishwarya Lakshmi holding Arjun Das; Are you in love fans – aishwarya lekshmi share pic with arjun das

బుట్ట బొమ్మ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవడానికి రెడీగా ఉన్నాడు. ఈ మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి ఇష్టమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టమా.. అంటూ వచ్చిన ప్రశ్నకు ఈ భామ అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.. ఇలా సమాధానం వచ్చిన నెల రోజులకే తన ప్రియుడిని పరిచయం చేస్తూ పోస్ట్ పెట్టడంతో తన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Lekshmi (@aishu__)