రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సోనియా అగర్వాల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్. ఓవర్ నైట్ కి ఈ సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. సోనియా అగర్వాల్ కు సంబంధించి గతంలో రెండవ వివాహానికి సంబంధించి పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి. ప్రముఖ సింగర్ తో ఈమె వివాహం జరగబోతోంది అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.తెలుగులో పాటు ఇతర భాషలలో సైతం నటించి మెప్పించిన సోనియా అగర్వాల్ తాజాగా రెండో వివాహం గురించి తన మనసులో మాటను తెలియజేసింది.

సోనియా అగర్వాల్ ప్రస్తుతం ఫాల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నది సరైన సమయం వస్తే రెండో వివాహం చేసుకోవడానికి తన కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తోంది. నేను కూడా మీ అందరిలాగే రెండో పెళ్లి చేసుకుని వ్యక్తి కొరకు ఎదురుచూస్తున్నానంటూ తెలుపుకొస్తోంది .ఇంకెన్ని రోజులు వివాహం చేసుకోకుండా ఇలా ఒంటరి జీవితాన్ని గడుపుతానో నాకు కూడా తెలియదంటూ ఆమె కామెంట్లు చేయడం జరిగింది. ఫాల్ అనే వెబ్ సిరీస్ లో తాను ఇల్లాలి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలియజేసింది.

Sonia Agarwal Opens Up About Her Ex-Husband Selvaraghavan! | Astro Ulagamఈ సిరీస్లో ఒక బిడ్డకు తల్లిగా కనిపించబోతున్నానని ఈ వెబ్ సిరీస్ లో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తోంది సోనియా అగర్వాల్. ఎట్టకేలకు సోనీ అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనని చెప్పిన నేపథ్యంలో ఆమె అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు.గతంలో సోనియా అగర్వాల్ డైరెక్టర్ సెల్వ రాఘవన్న వివాహం చేసుకుంది అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest