ర‌వితేజ ఉంటున్న ఇల్లు ఎన్ని కోట్లు విలువ చేస్తుందో తెలిస్తే షాకైపోతారు!

మాస్‌ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.‌. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అది తక్కువ మంది హీరోల్లో రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ.. అనూహ్యంగా హీరోగా మారి స్వయంకృషితో టాలీవుడ్ లోనే టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే రవితేజ ఉంటున్న ఇల్లు ఖరీదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రవితేజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నటుడు కమల్. సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో కమల్ హీరోగా నటించాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ రవితేజ గురించి మాట్లాడుతూ.. `ఇప్పుడెంత ఎనర్జీగా ఉండేవాడు అప్పుడు కూడా అంతే ఎన‌ర్జీతో ఉండేవాడు. కాకపోతే కొద్దిగా లావుగా ఉండేవాడు. కానీ రవితేజ ఎంతో కష్టపడి తనను తాను మార్చుకుంటూ ఇప్పుడున్న యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు.

నిత్యం క్రమం తప్పకుండా జిమ్ చేసేవాడు. ఎప్పుడు పెద్దగా బయటకు వచ్చేవాడు కాదు. హైదరాబాద్ త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాల‌ని అనేవాడు. అలాంటిది రవితేజ ఈ రోజున రూ. 12 కోట్ల ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నాడు` అంటూ కమల్ చెప్పుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలతో రవితేజ ఉంటున్న ఇంటి ఖరీదు రూ. 12 కోట్లు విలువ చేస్తుందని బహిర్గతమయింది. ఈ విషయం తెలిసి షాక్ అవ్వ‌డం నెటిజ‌న్ల వంతైంది.

Share post:

Latest