స‌మంత‌ను అమ్మ‌లా సంరక్షించుకుంటా.. వైర‌ల్‌గా మారిన ర‌ష్మిక కామెంట్స్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఆమె షూటింగ్స్ లో కూడా పాల్గొనలేకపోతుంది. ఇంటికే పరిమితమైన సమంత.. ప్రస్తుతం మ‌యోసైటిస్ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. సమంతపై నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా మారాయి.

ప్రస్తుతం రష్మిక త‌న బాలీవుడ్ మూవీ `మిషన్ మజ్ను` ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతుండగా.. సమంత గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో రష్మిక సమంత పై తన అభిమానాన్ని చాటుకుంది. `స‌మంత‌ దయగల హృదయం ఉన్న అద్భుతమైన అమ్మాయి. గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మనిషి.

ఆమెను ప్రస్తుతం ఒక అమ్మ లాగా సంరక్షించుకోవాలి అనుకుంటాను. ఆమె మయోసైటిస్‌ గురించి సోషల్‌ మీడియా ద్వార ప్రకటించిన తర్వాతనే నాకు కూడా తెలిసింది. సామ్ ఇలాంటి పరిస్థితులు జీవితంలో ఎన్నో చూసింది. నాకు న‌మ్మ‌కం ఉంది.. ఆమె మ‌యోసైటిస్ వ్యాధిని త‌ప్ప‌కుండా జ‌యిస్తుంది` అంటూ ర‌ష్మిక చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ స‌మంత ఫ్యాన్స్ ను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి.

Share post:

Latest