Pathaan:నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ మూవీ.. ఎలా ఉందంటే..?

బాలీవుడ్లో విడుదలైన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ నటీనటుల హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న షారుక్ ఖాన్ చిత్రం పఠాన్ సినిమా పైనే బాలీవుడ్ సినిమాలన్నీ ఆశపెట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం విలన్ గా అద్భుతంగా నటించినట్లుగా తెలుస్తోంది.

పఠాన్ నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, పాటలు బాగానే ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బేశారం పాట వల్ల పలు వివాదాలు చుట్టుముట్టడంతో ఈ సినిమాకు మరింత క్రేజీ తెచ్చిపెట్టాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్ లోనే షారుఖ్ ఖాన్ నయా రికార్డులను సైతం సృష్టించినట్లుగా తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల తర్వాత కం బ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ హిట్ కొట్టాడా లేదా అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

పఠాన్ షారుక్ ఖాన్ గ్రేట్ కం బ్యాక్ ఇచ్చారని ఈ సినిమా చూశాను నేటిజన్స్ తెలియజేస్తున్నారు. హాలీవుడ్ లెవెల్ తరహాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని మన వాళ్ళని కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తున్నాయని తెలియజేస్తున్నారు.

షారుక్ ఖాన్ ఇంట్రడక్షన్ అదిరిపోయిందని ఇంటర్వెల్ సస్పెన్స్ సూపర్ గా ఉందని మరి కొంతమంది నెటిజన్లు తెలియజేస్తున్నారు.

షారుక్ ఖాన్,, దీపికా పదుకొనే ,జాన్ అబ్రహం పవర్ఫుల్ పర్ఫామెన్స్ చేశారని తెలియజేస్తున్నారు. ఓవరాలకు బాలీవుడ్ కి కమ్ బ్యాక్ ఫిలిమ్ అని నెటిజన్లు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా బాలీవుడ్ దశ మారుతుందేమో చూడాలి మరి.

Share post:

Latest