అడివి శేష్‌ ఇంట్లో సందడి చేసిన సినీ తారలు… పెళ్లి ఎవరికంటే?

టాలీవుడ్ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. మనోడు సినిమా చేసాడంటే అది హిట్టవ్వాల్సి తీరాల్సిందే. ఎందుకంటే శేష్ ఒక్క నటనలోనే కాకుండా రైటింగ్, డైరెక్షన్ వంటి విషయాలలో బాగా రాటుదేలాడు. అందుకే ఒకటికి పదిసార్లు అలోచించి సినిమాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన సినిమాలకు తానే స్క్రీన్ప్లే అందిస్తూ ఉంటాడు. ఇకపోతే శేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతని సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, మెహందీ ఈవెంట్స్‌ వేడుకలు చాలా హాట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రముఖ కమెడియన్‌ వెన్నెల కిశోర్‌తో పాటు పలువురు సినిమా తారలు ఈ వేడుకల్లో సందడి చేయడం విశేషం. కాగా తన సోదరి వివాహానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు అడివి శేష్ . ‘చెల్లి పెళ్లిలో అమ్మానాన్న, నేను ఆనందంగా గడుపుతున్నాం. మా బావ డేవిన్ ని మా కుటుంబంలోకి ఆహ్వానించబోతున్నాం’ అని ఒక పోస్టు షేర్‌ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది.

ఇంకా శేష్ టెక్స్ట్ చేస్తూ… ‘చిట్టి చెల్లికి పెళ్లి జరుగుతోంది. రాజస్థానీ థీమ్ ట్రై చేశాం. కానీ పెళ్లి మాత్రం తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది’ అని మరో పోస్టును కూడా పంచుకున్నాడు. పలువురు సినిమా సెలబ్రిటీలు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలపడం ఇక్కడ మనం చూడవచ్చు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్‌, హిట్‌2.. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు మన అడివి శేశ్‌. ముఖ్యంగా గతేడాది అతనికి బాగా కలిసొచ్చింది. మేజర్‌, హిట్ 2 సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.

Share post:

Latest