బాలయ్య పాటకి స్టెప్పులేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటగా ఈమె కొన్ని టాక్ షోలు చేసి ఫేమస్ అయ్యింది. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి… ఆల పలు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది. కానీ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది మంచు లక్ష్మి.తీసిన సినిమాలు కూడా ఆమెను కొంచెం నిరాశపరిచాయనే చెప్ప వచ్చు .మోహన్ బాబు కూతురుగా గుర్తింపు ఉంది కానీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

బాలయ్య పాటకు స్టెప్పులు ఇరగదీసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్ | Can -wait To  See Mass Rampage Of Balayya Says Lakshmi Manchu , Balakrishna, Maa Bava  Manobavalu Song, Shruti Haasan , Tollywood, Gopichand ...

ఇక సినిమాలను కాస్త దూరం పెట్టి తనకు కలిసి వచ్చిన టాక్ షోలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో అది కూడా మానేసింది. ఈ మధ్యనే మోహన్ లాల్ నటించిన మాన్స్టర్ మూవీలో నటించింది. ఇది కాస్త పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన కూతురి డాన్సింగ్ ఫోటోలు, అలాగే ఆమె చేసే కొన్ని డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.

ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినా బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలోని ‘మా బావ మనోభావాలు “పాటకు డాన్స్ చేసి వార్తలలో నిలిచింది మంచు లక్ష్మి. ఈ పాటకు మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు కూడా ఈ వీడియోతో రాసుకొచ్చింది మంచు లక్ష్మి. బాలకృష్ణ సాంగ్ కి డ్యాన్స్ వేయటంతో ఆ వీడియో ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.