భారీ ధరకు కళ్యాణ్ రామ్ అమిగోస్ డిజిటల్ రైట్స్..!

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే బింబిసారా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు బింబిసారా చిత్రం మంచి ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభం నుంచే కళ్యాణ్ రామ్ ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే అమిగోస్. ప్రముఖ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.

Amigos: కల్యాణ్ రామ్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ | Kalyan Ram's 3 looks from Amigos  Movie have been released

ఈ సినిమా టైటిల్ వినగానే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నది. ఆమి గోస్ అంటే ఫ్రెండ్స్ ను పిలిచే స్పానిష్ పడమట ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పై మరింత అంచనాలు పెంచేశారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతుంది. ఈ సినిమాను నామ్ థియేటర్ హక్కులను దాదాపుగా రూ .10 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ అమిగోస్ సినిమాను రికార్డు స్థాయిలో థియేటర్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం వచ్చేనెల 10వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది. కళ్యాణ్ రామ్ ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ఈ సినిమా నుంచి విడుదలైన పలు పోస్టర్స్ తెలియజేస్తున్నాయి. ఈ సినిమాపై కూడా కళ్యాణ్ రామ్ అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇందులో ఆషికారంగనాథ హీరోయిన్గా నటిస్తున్నది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Share post:

Latest