ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు ఇవే.. ప్రేక్షకులకు సినిమాల పండగే…

ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఓటీటీలో కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మొదటి వారంలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హిట్ -2

శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ -2 సినిమాలో అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ‘హిట్ ది ఫస్ట్ కేస్’ సినిమా కి సీక్వెల్ గా వచ్చింది. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా బ్లాక్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఇక జనవరి 6వ తేదీ నుంచి హిట్ 2 సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే

ఓటిటి ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షోని బాలకృష్ణ హోస్ట్ చేస్తున్నాడు. అయితే ఈ షో కి గెస్ట్ కి డార్లింగ్ ప్రభాస్ హాజరయ్యారు. అయితే ప్రభాస్ వచ్చిన ఈ ఎపిసోడ్ మొదటి పార్ట్ కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆహాలో స్ట్రీమింగ్ అవడానికి రెడీ అవుతుంది.

ముంబై మాఫియా – పోలీస్ vs ది అండర్ వరల్డ్

1990 కాలంలో ముంబైని పాలిస్తున్న అండర్ వరల్డ్‌ను, ఎన్‌కౌంటర్ పోలీసులు ఆ అండర్ వరల్డ్‌ను ఎలా ఎదురించారు అనేది ఈ వెబ్‌సిరీస్‌లో చూడొచ్చు. ఈ క్రైమ్ సిరీస్ జనవరి 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఫోన్ బూత్

గుర్మిత్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఫోన్ బూత్ ‘ సినిమాలో కత్రినా కైఫ్, ఇషాన్ ఖాట్టారి, సిద్ధంట్ చతుర్వేది ప్రధాన పాత్రలలో నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఉంఛై

అమితాబ్ బచ్చన్ నటించిన ఉంఛై గత ఏడాది నవంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరిగే ఈ సినిమా Zee5లో జనవరి 6 నుంచి ప్రసారమవుతుంది.

ది పేల్ బ్లూ ఐ

ది పేల్ బ్లూ ఐ మూవీ అదే పేరుతో రచయిత లూయిస్ బేయార్డ్ రాసిన 2003 నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో హ్యారీ మెల్లింగ్, క్రిస్టియన్ బేల్ నటించారు. 1830లో వెస్ట్ పాయింట్‌లోని యూఎస్ మిలిటరీ అకాడమీలో జరిగిన వరుస హత్యలను ఛేదించే ప్రయత్నం చుట్టూ ఈ థ్రిల్లర్ తిరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ లో జనవరి 6 నుంచి ఈ సినిమా ప్రసారమవుతుంది.