సుకుమార్-విజయ్ సినిమా అట్టకెక్కినట్టేనా..?

డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో పుష్ప -2 చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నడుస్తోంది. మొదటి భాగం కంటే మరింత పవర్ ఫుల్ గా పార్ట్-2 ని తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ సినీ పుష్ప బాగా రీచ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప పార్ట్-2 మీద మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది సుకుమార్. ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ తో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించారు.

Vijay Devarakonda : 2023లో విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా | sukumar vijay  devarakonda movie in 2023
మైత్రి మూవీ మేకర్స్ లోనే సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. అందుకే ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ ని ముందుగానే రాంచరణ్ తో సుకుమార్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పుష్ప సిరీస్ లో భాగంగా పార్ట్ -3 కోసం రామ్ చరణ్ రంగంలోకి దింపబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే గతంలో సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని సంగతి గతంలో తెలియజేయడం జరిగింది.. లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda Teams Up With Sukumar For His Next project

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో మరొక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిసారిగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఇప్పటివరకు వచ్చిన కథలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సమంత ఆరోగ్యం బాగా లేకపోవడంతో కాస్త లేట్ అవుతోందా తెలుస్తోంది.

Share post:

Latest