ఎట్టకేలకు స్టార్ హీరో కుమారుడు మరొక సినిమాకు రెడీ..!!

సీనియర్ హీరోలలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో విలన్ గా పలు సినిమాలలో నటించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విలన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్.. నిర్మల కాన్వెంట్ సినిమాతో మొదటిసారిగా తెలుగు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో నాగార్జున ప్రధానోపాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత హీరోగా లాంచ్ అయిన రోషన్ ఏకంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD అనే చిత్రంలో నటించారు.

Acting classes for Srikanth's son

గతంలో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు చేసిన పెళ్లి సందడి సినిమా ఎంతటి క్రేజ్ ను సంపాదించిందో ఈ సినిమా కూడా అలాగే క్రేజ్ ను అందుకుంది. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే శ్రీ లీలాకు దక్కిన క్రేజ్ మాత్రం నటుడు రోషన్ కు దక్కలేదని చెప్పవచ్చు. శ్రీ లీల ప్రస్తుతం టాప్ హీరోలతో సైతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. రోషన్ మాత్రం ఇంకా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇప్పటివరకు సరైన ప్రాజెక్టును ప్రకటించలేదు. తాజాగా స్వప్న మూవీస్ బ్యానర్ మీద వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి స్వప్న మూవీస్ బ్యానర్ వారు కాస్త బడ్జెట్ ని ఎక్కువగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చూసుకుంటే నటుడు రోషన్ కి తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి మార్కెట్ లేదు. కానీ స్వప్న మూవీస్ కథ మీద నమ్మకంతోనే ఈ చిత్రాన్ని ఇంత భారీ బడ్జెట్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఇది వాస్తవం అనే విషయం తెలియాల్సి ఉంది.