ఎంపీ విజయసాయిరెడ్డి.. తారకరత్న కి ఏమవుతారో తెలుసా..?

నిన్నటి రోజున మొదలైన లోకేష్ పాద యాత్ర కు మద్దతు తెలపటానికి నందమూరి తారకరత్న కుప్పం వెళ్లారు.ఈ సందర్భంలోనే ఉన్నట్టుండి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం పిఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా..హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తేల్చారు. అయితే పరిస్థితిలో మార్పు రావటంతో బెంగళూరుకు తరలించారు. ఇదిలా ఉంటే తారకరత్నకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

Tarakaratna: Tarakaratna is a close relative of YCP MP Vijayasai Reddy.. The relationship between the two is.. | Do You Know The Relationship Between Tarakaratna And YCP MP Vijayasai Reddy Telugu Cinema

అదేమిటంటే వైయస్సార్సీపి ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్న దగ్గరి బంధువులవుతారట. విజయ్ సాయి రెడ్డి సతీమణి సొంత చెల్లెలి కూతుర్ని తారకరత్న పెళ్లి చేసుకున్నారట. అంటే తారకరత్న విజయ్ సాయి రెడ్డికి అల్లుడి వరస అవతారన్నమాట. ఇక తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి .ఈమె టాలీవుడ్లో కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. అందులో భాగంగా తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా బాధ్యతలు నిర్వహించింది.

Jagan's close aide Vijayasai Reddy to be Andhra's special representative in  Delhi | The News Minute

ఆ సినిమా టైమ్ లోనే వీరిద్దరూ ప్రేమ చిగురించి వివాహం వరకు దారితీసింది. వీరి పెళ్లి హైదరాబాదులో సంఘీవీటెంపుల్లో అలేఖ్యరెడ్డి ,తారకరత్న వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లికి వారి సన్నిహితులు ,స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అలా అలేఖ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల విజయ సాయి రెడ్డికి తారకరత్న మధ్య మామ అల్లుళ్ళ బంధం ఏర్పడిందట.అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలుమార్లు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ విషయంపై ఒకానొక సందర్భంలో స్పందించిన తారకరత్న.. రాజకీయాలు వేరు కుటుంబం వేరు నేను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటాను అని క్లారిటీ ఇచ్చారట.ఇక ఇప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉన్నందున తన అభిమానులు ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.