సిల్క్ స్మిత సూసైడ్ నోట్ లో .. ఏం రాసిందో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో శృంగార తారగా పేరుపొందింది నటి సిల్క్ స్మిత. ఈమె పూర్తి పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఈమెకు 15వ ఏటనే ఈమె తల్లిదండ్రులు ఈమెకు వివాహం చేశారు. కానీ ఈమె అత్త భర్త మాత్రం ఇమెని వేధింపులకు గురి చేయడంతో ఇంటి నుండి పారిపోయి మద్రాస్ కు వెళ్ళిపోయిందట. అక్కడ తెలిసిన వాళ్ళతో మొదటగా సినీ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇకపలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు నటిస్తున్న ఈమె మలయాళం డైరెక్టర్ ఆంథోనీ ఈస్ట్ మాన్.. ఇనయే తేడి అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.

Have You Ever Read Actress Silk Smitha's Tragic Suicide Note? | Astro Ulagam
ఇక ఆ తరువాత తమిళ్ తెలుగు ,మలయాళం, కన్నడ ప్రేక్షకుల బాగా ఆకట్టుకునేలా చేసింది. సిల్క్ స్మిత క్రేజ్ ఎలా ఉండేది అంటే ఈమె సగం కొరికిన యాపిల్ ఒక షూటింగ్లో వదిలి వెళ్ళగా అక్కడ ఉన్న మేకప్ మ్యాన్ ఆ యాపిల్ని వేలంపాట వేయగా అప్పట్లోనే రూ .26 వేల రూపాయలకు కొనుక్కున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంది. అందుకు గల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి కానీ సిల్క్ స్మిత చనిపోతూ ఒక లెటర్ ని మాత్రం రాసుకున్నట్లుగా తెలుస్తోంది.

Have you ever read actress Silk Smitha's last letter? it goes viral in  Social Media | 'I can not stand it anymore'; Have you read Silk Smitha's  suicide note? - time.news -ఇక ఆ లెటర్ లో ఏముందంటే..1996-9-22 దేవుడా నా ఏడు సంవత్సరాల నుంచి నా పొట్టకి కష్టపడ్డాను నాకు నా అనుకున్న వారు ఎవరూ లేరు నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరు ప్రేమ చూపలేదు.ఎవరికి నామీద ప్రేమ లేదు బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే నా నాశనం కోరుకున్న వారే అంటూ తెలియజేసింది. నాకు ఉన్న ఏ కొంచమైనా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచలేను నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నా అతను నన్ను మోసం చేశాడు. దేవుడు ఉంటే వారిని చూసుకుంటాడని రాసుకొచ్చింది. దేవుడు నన్ను వేషం కోసమే పుట్టించాడు నేను ఎంతోమందికి మంచి చేసిన వంచన చేశారు.. నాకు ఒకడు ఐదు సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు ఇప్పుడు ఇవ్వనంటున్నాడు నా జీవితంలో ఎంతో భరించాను కానీ ఇది నా వల్ల కావడం లేదు ఇది రాయడం కోసం నేను ఎంతో నరకపడ్డాను నాకే తెలుసు అంటూ రాసుకుంది సిల్క్ స్మిత ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest