భోళా శంకర్ చిత్రం రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఇక ఈ సినిమాతో మరొకసారి మాస్ కమర్షియల్ జోన్ లో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకి రిమెకుగా తెరకెక్కిస్తున్నారు.

First look of megastar Chiranjeevi's 'Bhola Shankar' is out | Entertainment  News | English Manorama

ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ చిరంజీవి ఇమేజ్కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా గడిచిన కొద్ది రోజుల క్రితం షూటింగ్లో మొదలుపెట్టారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ఆడేన్స్ ని కనెక్ట్ చేసే విధంగా ఈ చిత్రంలో సిస్టర్ సెంటిమెంటును కూడా హైలెట్ గా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ మెహర్ రమేష్. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాని వీలైనంత వేగంగా షూటింగ్ చేసి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా సమాచారం.

ఈ తరుణంలోనే ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే 12వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చిత్ర బృందం సమాచారం. ఈ సినిమా ఖర్చుల భారం ఎక్కువగా కాకుండా ఉండేందుకు చిరంజీవి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా లో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది హీరోయిన్గా తమన్నా నటిస్తున్నది ఏ మేరకు అభిమానులను ఏ చిత్రం మెప్పిస్తుందో చూడాలి మరి.

Share post:

Latest