గుంటూరు మంత్రులు డేంజర్ జోన్‌లో..ముగ్గురికి చెక్?

అధికార వైసీపీలో మంత్రుల పాత్ర అభివృద్ధి చేయడం కంటే..ప్రతిపక్ష నాయకులని తిట్టడమే ఎక్కువనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఏ మంత్రి అయినా ప్రెస్ పెడితే..వారి శాఖలకు సంబంధించి మాట్లాడటం తక్కువగా కనిపిస్తోంది..ఎంతసేపు ప్రతిపక్ష నేతలని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెట్టడమే అన్నట్లు ఉంది. అసలు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి పనుల గురించి మాట్లాడటం కనిపించడం లేదు.

దీంతో మంత్రులు ఏ శాఖ బాధ్యతలు చూసుకుంటున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. దీని వల్ల చాలామంది మంత్రులపై నెగిటివ్ కనిపిస్తుంది..మళ్ళీ ఆ మంత్రులు గెలవడం కూడా కష్టమే అని పరిస్తితి. అలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురు మంత్రుల పరిస్తితి ఉందని తెలుస్తోంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అంబటి రాంబాబు, విడదల రజిని, మేరుగు నాగార్జున ఉన్నారు.

వీరి ముగ్గురికి రెండో విడతలో మంత్రి పదవులు దక్కాయి. అయితే ఏనాడూ వీరు తమ తమ శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి జరుగుతున్నట్లు వివరించడం అసలు కనిపించలేదు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఉన్నారంటే…నీటిపారుదల శాఖ. అసలు పోలవరం ఏం అవుతుందో పెద్దగా చెప్పరు గాని..ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, పవన్‌లని తిడతారు అని జనం అనుకునే పరిస్తితి. అటు రజిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి..ఈమె సోషల్ మీడియాలో డప్పు కొట్టుకోవడమే తప్ప..చేసేదేమీ లేదని టి‌డి‌పి విమర్శలు చేస్తుంది.

ఇక మేరుగు నాగార్జున…ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం..చంద్రబాబుపై విరుచుకుపడటం చేస్తూ ఉంటారు. ఇలా కేవలం విమర్శలకు పరిమితమైన ఈ మంత్రులకు తమ తమ స్థానాల్లో పెద్దగా పాజిటివ్ లేదని, ఈ సారి వారు గెలుపు డౌటే అనే ప్రచారం వస్తుంది. చూడాలి మరి ఈ ముగ్గురులో ఎవరు గట్టెక్కుతారో.