చిరు తో సినిమా తీయబోతున్న చిరంజీవి కూతురు..!!

చిరంజీవి ,రవితేజ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య నిన్నటి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత కొణిదెల పలువురు మీడియాతో సమావేశంలో వాల్తేరు వీరయ్య సినిమా గురించి తెలియజేసింది.

Chiranjeevi Congratulates His Daughter Sushmita Konidela

ముఖ్యంగా చిరంజీవి కాస్టింగ్ డిజైన్ గురించి చెబుతూ ఈ కథ విన్నప్పుడు వాల్తేర్ పోర్ట్ ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే ఒక ఇమేజినేషన్ వచ్చింది.. డైరెక్టర్ బాబి ఆలోచనతో అవి చాలా వరకు మ్యాచ్ అయ్యాయి మాకు వింటేజ్ చిరంజీవి గారి లుక్కు కావాలని బాబి చెప్పారట. మేము ఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో అలాగే గ్యాంగ్ లీడర్ లా కావాలని తెలియజేసినట్లు తెలిపింది.నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు ఎన్నోసార్లు చూశాము దీంతో పెద్దగా రీ సెర్చ్ చేయవలసిన అవసరం లేలేదని అలాగే సినిమాలో రవితేజ గారికి శృతిహాసన్ గారికి వారి డిజైనర్స్ పనిచేశారని తెలిపింది.

Chiranjeevi's daughter Sushmita set for acting debut

ప్రతి ఒక్కరము సమన్వయంతో పనిచేశాము తన తండ్రికి ఉన్న అనుభవం గొప్పది ఏ సీన్లో ఎలా కనిపించాలో ఆయనకు బాగా తెలుసు లుంగీ డిజైన్ ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు ఉంటే బాగుంటుందని కొన్ని సూచనలు కూడా ఇచ్చారని తెలిపింది. వాల్తేరు వీరయ్య సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశామని తెలియజేసింది.కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంటూనే నిర్మాణం పైన దృష్టి పెట్టిన విషయం తెలుపుతూ ఇప్పటికి ఒక వెబ్ సిరీస్ మరొక ఓటీపీ మూవీ తీశాము. వాస్తవానికి నాన్న గారితో సినిమా నిర్మించాలని అందరీ నిర్మాతల లాగే మాకు కూడా కోరిక ఉంది. అందరికీ చెప్పినట్టుగానే తన తండ్రి ముందు మంచి కథ తీసుకురా వెంటనే చేద్దామని చెబుతున్నారట. దీంతో రాబోయే రోజుల్లో సుస్మితత చిరంజీవి సినిమా చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Share post:

Latest