తెలుగు బిగ్ బాస్ సీజన్7 వచ్చేస్తుంది.. హోస్ట్ గా అ కండల వీరుడు వచ్చేస్తున్నాడు..!

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో ఎంతగా పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విధంగా ఈ షో పాపులర్ అయింది. ఇక అందులోనూ ఆ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ప్రేక్షకుల మనస్తత్వాలు పోలి ఉన్నవాళ్లను ఓన్ చేసుకుని.. వారికి మద్దతుగా నిలుస్తారు. అయితే గత సీజన్ 6 మాత్రం కాస్త ప్రేక్షకులకు రోత పుట్టించిందనే చెప్పాలి.

ఈ షోని ఎంతగానో ఇష్టపడే వారు కూడా గత సీజన్ పై పెదవి విచారు. గత సీజన్లో పాల్గొన్నా కంటెస్టెంట్స్ దగ్గర నుంచి అన్ని విషయాలలో నిర్వాహకులు ఫెయిలయ్యారు. సీజన్ 6 గత ఏడాది డిసెంబర్ 17 తో ముగిసింది. ఇక‌ విన్నర్ గా రేవంత్ ట్రోపీ గెలుచుకున్నాడు. శ్రీహాన్ రన్నరప్‌గా ఇంటిదారి పట్టాడు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంప్లీట్ అయి నేల కావస్తుంది.. అప్పుడే కొత్త సీజన్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

బిగ్ బాస్ 7 సీజన్ ఈసారి కాస్త తొందరగానే ప్రసారం కానుంది అని తెలుస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ లో కొత్త సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు తాజాగా 2023 జూలై నెలలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కాబోతున్నట్టు టాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. బిగ్ బాస్ సీజన్ 6 మధ్యలోనే నాగార్జున హోస్టుగా తప్పుకుంటున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నిజంగానే నాగార్జున7వ సీజన్‌కు హోస్టుగా తప్పుకుంటున్నాడని తెలుస్తుంది.

Tarakaratna

రాబోయే కొత్త సీజన్లో టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హోస్ట్ గా చేయనున్నారట. అంతేకాకుండా ఇప్పటివరకు కంప్లీట్ అయిన సీజన్లు అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్లో భాగం కానున్నారట.ఈసారి ఈ షోలో మరో ఆన్ ఎక్స్పెక్టెడ్ హీరో కూడా కంటెస్టెంట్ గా రానున్నారని తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి కుటుంబం నుంచి హీరోగా వచ్చిన నందమూరి తారకరత్న 7వ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా రాబోతున్నారంటూ టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ షో ద్వారా తన ఇమేజ్‌ను పెంచుకోవాలని భావిస్తున్నారట తారకరత్న. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఎలాంటి సంచానాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share post:

Latest