డబ్బు కోసం సుమ యాంకరింగ్ హద్దులు దాటుతోందా? రాజీవ్ కనకాల అలక దేనికి?

టాలీవుడ్ యాంకర్ సుమ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆమె తన మాట తీరుతో, అందమైన హావభావాలతో తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించింది. బేసిగ్గా మలయాళీ అయినటువంటి సుమ తెలుగునాట నాటుకుపోవడం అంటే సాధారణమైన విషయం కాదు మరి. ఇండస్ట్రీలో తన మాటలతో ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్లైనా సరే ఇట్టే ఇరుకున పెట్టేస్తుంది. ఇక సినిమా ఆడియో ఫంక్షన్స్ అయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే అని సదరు నిర్మాతలు భావిస్తారు.

ఇక సుమ విషయంలో తన భర్త అయినటువంటి రాజీవ్ కనకాల కాస్త గుర్రుగా వున్నాడని ఫిలిం నగర్లో గుసగుసలు వినబడుతున్నాయి. విషయం ఏమంటే, సుమ ఓ షోలో కాస్త హద్దులు మీరి యాంకరింగ్ చేస్తుంది అంటూ కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే చిరంజీవితో ఈమె చేసిన అల్లరి కూడా కాస్త హద్దులు దాటిందని ఓ వర్గంవారు బాగా ఫీల్ అవుతున్నారని సమాచారం. అంతేకాకుండా ఆ తర్వాత జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్లు వచ్చిన ఎపిసోడ్ లో కూడా ఈమె హద్దులు మీరి ప్రవర్తించినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇపుడు ఈ విషయం పైనే రాజీవ్ కూడా ఆమెకి కొంచెం క్లాస్ పీకాడని టాక్ నడుస్తోంది. చాలామంది సుమ డబ్బుల కోసం ఇలా హద్దులు మీరి యాంకరింగ్ చేస్తోంది అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాన్ని చాలా వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. యాంకర్ హోస్టుగా చేసిన స్టార్ మహిళ, జీన్స్,క్యాష్, భలే చాన్సులే వంటి ప్రోగ్రాములు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక స్టార్ మహిళ వంటి ప్రోగ్రాంని ఏకంగా కొన్ని వేల ఎపిసోడ్లను నడిపించిన యాంకర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది.

Share post:

Latest