శ్రీలిల తన క్రేజ్ ని నిలబెట్టుకుంటుందా..?

కిస్ కన్నడ సినిమాతో ప్రేక్షకులను తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది హీరోయిన్ శ్రీలిల. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఈ సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించారు. ఈ చిత్రం తర్వాత శ్రీ లీల కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈమె అందానికి ఫిదా అయి తన సినిమాలో కచ్చితంగా ఈమె కావాలంటూ దర్శక నిర్మాతలను కోరుతున్నారట.

Kiss Kannada Movie Leaked Online by Tamilrockers for Free Download - News  Bugzప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ అందరీ క్రేజ్ తగ్గుతూ ఉండడంతో శ్రీ లీల స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఒక క్రేజి ప్రాజెక్టులో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈమె చేతిలో ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఈమె స్టార్డమ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట.

Kiss | Photogallery - ETimes
ఈ నేపథ్యంలో హీరోయిన్గా పరిచయమైన మొదటి చిత్రం కీస్ ని తెలుగులో ఐ లవ్ యు ఇడియట్ అనే పేరుతో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఏపీ అర్జున్ తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీ లీల బెస్ట్ డేబ్లూ సైమ అవార్డు కూడా అందుకున్నట్లు సమాచారం. మరి ఏ మేరకు శ్రీ లీల ఈ సినిమాతో శ్రీలిల క్రేజ్ ని క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

Share post:

Latest