బాలయ్య కి ఈసారి సంక్రాంతి కలిసొచ్చేనా..?

నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా ఉంది. ఈ సీజన్లో ఆయన నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం సంచలన విజయం సాధించినవే ఉన్నాయి. మరి 2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి గా పోటీకి దిగుతున్నారు. బాలయ్య మరి ఈసారి సక్సెస్ పొందుతాడో.. లేదో తెలియాలి అంటే.. మునుపటి చిత్రాల గురించి మనం తెలుసుకోవాలి. మరి సంక్రాంతి బరిలో బాలయ్య పోటీకి దిగినప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Balayya's #NBK107 titled Veera Simha Reddy - TeluguBulletin.com

వేములవాడ భీమకవి:
1976 జనవరి 8న విడుదలైన సినిమా బాలయ్యకు తొలి సంక్రాంతి సినిమా కావడం గమనార్హం. ఎన్టీఆర్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాకు దాసరి యోగానంద్ దర్శకత్వం వహించారు. బాలయ్య టైటిల్ పాత్రలో వేములవాడ భీమకవిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

దానవీరశూరకర్ణ:
1977న జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ అభిమన్యుడిగా నటించిన విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .అయితే ఈ సినిమా విజయం అన్న గారి ఖాతాలోకి చేరిపోయింది.

ఆత్మబలం:
1985 జనవరి 11వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాలో సోలో హీరోగా బాలయ్యకు తొలి సంక్రాంతి సినిమా తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

భార్గవ రాముడు:
1987 జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాలయ్యకు తొలి సోలో సంక్రాంతి సక్సెస్ మూవీ గా నిలిచింది..

ఇన్స్పెక్టర్ ప్రతాప్:
1988 జనవరి 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

భలే దొంగ, ప్రాణానికి ప్రాణం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి , వంశోద్ధారకుడు, నరసింహ నాయుడు , సీమ సింహం, లక్ష్మీ నరసింహ , గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహ ఇలా ఈ చిత్రాలన్నీ కూడా సంక్రాంతి పండుగకు విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఈసారి పక్క బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోబోతుందని చెప్పవచ్చు.

Share post:

Latest