2022 నేర్పిన పాఠం.. ఆ బ్యాక్ డ్రాప్ అంటేనే భ‌య‌ప‌డుతున్న టాలీవుడ్ హీరోలు!

నక్సలిజం బ్యాక్ డ్రాప్ అంటేనే టాలీవుడ్ కు చెందిన హీరోలు భయపడుతున్నారు. అందుకు కారణం 2022 నేర్పిన పాఠమే. ఒకప్పుడు నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చేవి. రాను రాను ఇలాంటి సినిమాలు చేయడం తగ్గించారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది నక్సల్ కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలు వచ్చాయి.

అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల న‌డుమ‌ విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత రానా, సాయి పల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో విరాటపర్వం అనే లవ్ స్టోరీ చేశారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

రీసెంట్గా సంతోష్ శోభ‌న్ `లైక్ షేర్ సబ్ స్క్రైబ్` అనే మూవీ తో వచ్చాడు. ఈ మూవీని సైతం నక్సలిసం బ్యాక్ డ్రాప్ లోనే తెర‌కెక్కించారు. కానీ ప్రేక్షకులను ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొత్తంగా 2022లో వచ్చిన మూడు నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ హీరోలు న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ అంటేనే భయపడుతున్నారు. అసలు ఆ జోన‌ర్ లో సినిమా చేసేందుకు ఏ ఒక్కరూ ముందడుగు వేయడం లేదు.