తన భార్య నిజస్వరూపాన్ని బయటపెట్టిన నటుడు పృథ్వీరాజ్.. మరీ ఇంత ఘోరమా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో చేరి అవమానాల పాలయ్యాడు. ఆపై జనసేన పార్టీలో చేరాడు. పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాల్లో.. రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి ఆమెతో తనకు ఉన్న గొడవల గురించి మాట్లాడుతూ, కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయమ్మ గారు చాలా మంచి మనిషి, ఆమె జీవితంలో ఎన్నో చూశారని పృథ్వి తెలిపాడు. అంతేకాకుండా భార్య అనేది ఏటీఎం కార్డులా ఉండకూడదని కూడా తెలిపారు. అలానే భార్యాభర్తల అనుబంధం అనేది చాలా అద్భుతమైనది అని తెలిపారు. సాయి తేజ సినిమాలో నటించేటప్పుడు పృథ్వి పైనుంచి కిందపడటంతో గాయల పాలయ్యాడు. నిజంగా భార్య అనే ప్రేమ ఉంటే తన భార్య ఆ సమయం నా దగ్గరకి వచ్చి నన్ను చూసుకునేది. కానీ అలా జరగలేదు అని పృథ్వి తన భార్య గురించి నిజాలు బయటపెట్టాడు. కేసులు పెట్టేముందు ఒకసారి ఇవ్వన్నీ ఆలోచించాలని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పృథ్వి తన బంధువులని ఎవరినీ నమ్మనని, ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని తెలిపాడు.

ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ ఈసారి జనసేనకు మంచి ఫలితాలు వస్తాయిని పేర్కొన్నాడు. ఇక వైరల్ అవుతున్న ఆడియో తన వాయిస్ కాదని ఎవరో కావాలనే తనని టార్గెట్ చేసారని పృథ్వి రాజ్ కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Share post:

Latest