స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ కిడ్.. ఏమైందంటే..?

తాజాగా కామెడీ బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి , రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ , నరేష్ అగస్త్య, దివ్య దృష్టి , విద్య, వికాస్ ముప్పల తదితరులు నటిస్తున్న ఆంథాలజీ చిత్రం పంచతంత్రం. కంచరపాలెం సినిమా రిలేటెడ్ గా తెరకెక్కుతున్న ఐదు కథల సినిమా ఇది. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్ , సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష పులికాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీన అంటే ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ కానుంది.అందుకే హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ బిగ్ టిక్కెట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శివత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ..” అఖిలేష్ కోసమే ఈ సినిమా చేశాను . హర్ష ఇంత మంచి కథను రాస్తాడని.. ఇంత చక్కగా నేరేట్ చేస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. లేఖ అనే అందమైన క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు హర్షాకి ధన్యవాదాలు. హర్ష తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. ఈ సినిమా చేసిన వారందరూ నా స్నేహితులే.. సినిమా ఆటోగ్రాఫర్ రాజుకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.. నన్ను చాలా చక్కగా చూపించారు.

బ్రహ్మానందం , సముద్రఖని, స్వాతి ఇలాంటి అద్భుతమైన నటులతో కలిసి నా కెరియర్ మొదట్లోనే నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. పర్సనల్ గా నాకు దివ్య , విద్య అనే ఇద్దరి ఫ్రెండ్స్ ను ఈ సినిమా నాకు ఇచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదల కాబోతోంది . తప్పకుండా సినిమా చూడండి.. మీకు నచ్చుతుంది అంటూ చెప్పింది ..అంతేకాదు సినిమా అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలి అంటూ స్టేజి పైన కన్నీళ్లు పెట్టుకుంది శివాత్మిక రాజశేఖర్”.. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest