అన్ స్టాపబుల్ ప్రోమో 6 కి ఆ స్టార్ హీరోయిన్స్..!!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ఈ షో కి ఎంతోమంది సినీ ప్రముకులు, రాజకీయ నేతలు కూడా ఈ షోకి హాజరు కావడం జరుగుతోంది. ఇక రెండవ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంటోంది ఈ టాక్ షో. మొదట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడుతో కలిసి ఈ రెండవ సీజన్ ప్రారంభించారు. ఆ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ సందడి చేయడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ ఎపిసోడ్కి అడవి శేషు, శర్వానంద్ రావడం జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి బాలయ్య స్నేహితులు రావడం జరిగింది.

అనాటి బంధం: జయసుధ కోసం జయప్రద ప్రచారం! | Jayaprada to campaign for Jayasudha  - Telugu Oneindiaప్రతి ఎపిసోడ్ లో కూడా ప్రత్యేకంగా ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సీజన్ -2 ని ఏర్పాటు చేయడం జరిగింది ఆహా సంస్థ. రీసెంట్గా రాఘవేందర్ రావు, సురేష్ బాబు, అల్లు అరవింద్ ,ఏ కోదండరామిరెడ్డి సంబంధించిన ఎపిసోడ్ నిన్నటి రోజున రాత్రి 9 గంటలకు ఆహ లో స్ట్రిమ్మింగ్ అవ్వడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సీజన్ ని మరింత స్పెషల్గా చేసేందుకు పలువురు క్రేజీ స్టార్ హీరోయిన్లను కూడా ఈ షోలోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే త్వరలోనే ఈ టాక్ షోలో అలనాటి హీరోయిన్స్ జయప్రద, జయసుధ కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ప్రాణ స్నేహితులుగా ఉన్న ప్రభాస్, గోపీచంద్ కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ వచ్చి ఎపిసోడ్ కి ఈ షో కి ఎవరు గెస్ట్ గా వస్తారనే విషయంపై తెలియాలి అంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Share post:

Latest