2022లో యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న టాలీవుడ్ సాంగ్స్ ఇవే!

2022 ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ తో దుమ్మురేపిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప ది రైజ్: శ్రీవల్లి

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట 54 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్ సంపాదించింది. ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ద్ శ్రీరామ్ పాడాడు.

బీస్ట్

పూజ హెగ్డే, విజయ్ హీరో హీరోయిన్లగా నటించిన బీస్ట్ సినిమాకి అనిరుద్ రవిచంధ్రన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో అరబీక్ కుత్తు అనే సాంగ్ కూడా 34 కోట్ల వ్యూస్ తో ఒక ఊపు ఊపింది.

పుష్ప

పుష్ప సినిమాలోని సామీ సామీ సాంగ్ 10 కోట్ల వ్యూస్‌ సంపాదించింది. ఈ పాటను విదేశీ కూడా బీభత్సంగా చూసేశారు. ఈ పాటలో రష్మిక తన అందాలను ఆరబోస్తూ సెగలు పుట్టించింది.

కచ్చా బాదం

కచ్చా బాదం రీమిక్స్ సాంగ్ 38 కోట్లతో సినిమా పాటలకంటే ఎక్కువ హిట్ అయింది. ఈ ఆల్బమ్ లో భువన్ బద్యాకర్, అమిత్ దూల్ నిషా బట్ నటించారు. ఈ పాటకి ఆర్కె బృందం సంగీతం అందించారు. ఈ పాట పల్లీలు అమ్ముకునే ఒక వ్యక్తి మొదటగా పాడాడు. అది సోషల్ మీడియాలో పాపులర్ చివరికి ఒక ఆల్బమ్‌గా విడుదలయ్యింది. అదే ఆల్బమ్ రికార్డులను తిరగరాసింది.

• లే లే ఆయీ కోకకోలా అనే పాట కూడా బాగా హిట్ అయింది. దీనికి సర్వింద్ మల్హార్ సంగీతం అందించారు.

• పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊఊ అంటావా పాట కూడా కోట్లకు వ్యూస్ తో అదరగొట్టింది.

• కన్హయ్య కుమార్ యాదవ్ కంపోజ్ చేసిన సాంగ్ కేసరిలాల్ కూడా సూపర్ హిట్ అయింది.

Share post:

Latest