పీక‌ల్లోతు ప్రేమ‌లో సిద్ధార్థ్-అదితి.. ఇంత‌కంటే ప్రూఫ్‌ ఇంకేం కావాలి?

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్, హైదరాబాదీ బ్యూటీ అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల‌ నుంచి జోరుగా నెట్టింట‌ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల అదితి బ‌ర్త్‌డేకి సిద్ధార్థ్ త‌న‌తో క్లోజ్‌గా దిగిన ఫోటోను ఇన్‌స్టా ద్వారా పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా `నా గుండెల్లో యువరాణి` అంటూ అదితికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

దీంతో సిద్ధార్థ్-అదితి ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు ఊపందుకున్నాయి. వీరిద్దరూ జంటగా `మహాసముద్రం` సినిమాలో నటించారు. శ‌ర్వానంద్ ఇందులో మ‌రో హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా సమయంలోనే సిద్ధార్థ్‌, అతిది మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం ప్రేమగా మారడంతో ప్రస్తుతం వారిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు నెట్టింట‌ షికార్లు చేశాయి.

అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై అటు సిద్ధార్థ్‌ ఇటు అతితి ఇద్దరూ స్పందించలేదు.. ఖండించలేదు. పైగా ఇటీవల శర్వానంద్ ఓ కార్యక్రమంలో సిద్ధార్థ్ అదితిల‌ ప్రేమాయణం నిజమే అంటూ పరోక్షంగా కామెంట్స్‌ చేశారు. ఇక తాజాగా సిద్ధార్థ్‌ అతిది ముంబై హోటల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ ప్రేమ జంట మీడియాకు చిక్క‌డంతో ఫోటోలు క్లిక్ అనిపించారు. ప్ర‌స్తుతం సిద్ధార్థ్‌ అతిదిల‌ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారడానికి ఈ ఫోటోలే ప్రూఫ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.