స్టార్ యాక్టర్ రావుగోపాల్‌రావుని చితక బాదింది ఎవరు.. ఎందుకు బాదారు…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రావుగోపాల్‌రావు అంటే విలనిజానికి మారుపేరు. ఈ దిగ్గజ ప్రతినాయకుడు కాకినాడ దగ్గరలోని గంగనపల్లి గ్రామంలో జన్మించాడు. ‘భక్త పోతన’ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక దాని తర్వాత ‘ముత్యాలముగ్గు’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి మరో మెట్టు ఎక్కారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. 1994లో షుగర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశాడు.

ఆ తర్వాత ఆయన కుమారుడు రావు రమేష్ కూడా తండ్రి లానే విలన్ పాత్రలు ఎంచుకొని ఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతున్నాడు. కాగా రావుగోపాల్‌రావు సినిమాలో నటించేటప్పుడు ఎంత డెడికేషన్ చూపిస్తారో తాజాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ వెల్లడించాడు. ఆయన ప్రకారం, సర్కస్ రాముడు సినిమాలోని ఓ పాట కోసం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ రావుగోపాల్‌రావుని కొరడాతో కొట్టాడట. దాంతో రావుగోపాల్‌రావుకి రక్తం వచ్చిందట. హీరో విలన్‌ని కొడుతూ ఉంటే ఈ పాట సాగాల్సి ఉంది. ఈ పాట ‘అమావాస్యకి.. పున్నమికి.. రేగిందంటే మామో పంబ రేగుతుంది మామ’ అనే సాగుతుంది. అయితే ఈ పాట షూట్ సమయంలో రామారావు కొరడా పట్టుకొని గోపాల్ రావు ని కొట్టాల్సి ఉంది. కాగా అతడు నిజమైన కొరడాతో కొట్టడంతో రావు గోపాల్ రావుకి రక్తం వచ్చింది.

అలా రావుగోపాల్‌రావుకి రక్తం వస్తున్నా కూడా ఆపకుండా ఎన్టీఆర్ కొడుతూనే వున్నారట. ఆరోజు షూటింగ్ సాయంత్రం వరకూ జరిగింది. షూటింగ్ అయిపోయాక చూస్తే.. ఆయన వీపు మీద మొత్తం రక్తం కారుతూ చొక్కా మొత్తం వీపుకు అతుకుపోయింది. అయిన కూడా ఆయన ఏ మాత్రం తగ్గకుండా షూటింగ్‌లో అలానే పాల్గొన్నారు. అలా పాత్రలో లీనమైపోతుంటారు రావుగోపాల్‌రావు. ఇలాంటి పాత్ర ఆయనకు నటన పట్ల ఉన్న డెడికేషన్‌కి ఓ మంచి నిదర్శనం అని చెప్పొచ్చు.

Share post:

Latest