చెత్త అంటూ ఆ ఎయిర్‌లైన్స్‌పై రానా సంచలన వ్యాఖ్యలు..

సినీ నటులు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా విమానాలనే ఎంచుకుంటుంటారు. అయితే ఒక్కోసారి వారు ఆ విమానయన యాత్రలో అనుకోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులతో సహనం కోల్పోయి సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని వెళ్లగక్కుతుంటారు. ఇప్పటివరకు అలాంటి వాళ్లను చాలానే చూశాం. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాలెస్ట్ స్టార్ హీరో రానాకి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక చేదు అనుభవం ఎదురైంది. రానా ఇండిగో ఎయిర్‌లైన్స్ వారి విమానంలో ప్రయాణించే సమయంలో రానా బ్యాక్ మిస్ అయిందట. దాంతో అసహనానికి గురైన ఆయన ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవలపై ట్వీట్ల చేస్తూ ఏకిపారేశాడు.

ఇండియాలోనే వరస్ట్ ఎయిర్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ ఇండిగోలో జరిగిందని, ఆ ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఫ్లైట్స్ కూడా టైమ్‌కి రావని, ఇక లగేజీ మిస్ అవుతే పట్టించుకునే వాళ్లే ఉండరని రానా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తన లగేజ్ బ్యాగ్ మిస్ అయిన విషయం ఎయిర్‌లైన్ స్టాఫ్‌కి తెలిసినా ఇంతవరకు అది తన చేతికి అందలేదని.. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా అని కూడా రానా ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా ఇండిగో ఎయిర్‌లైన్ ట్వీట్స్‌కు ఒక రేంజ్‌లో కౌంటర్లు వేస్తున్నాడు.

ఇండిగో ట్విట్టర్ హ్యాండిల్ విమానం కిటికీలు నుంచి మేఘాలలో ఉన్న ఒక ఫొటోని షేర్ చేసి స్వర్గం ఇక్కడ దొరికేసిందని ఒక ట్వీట్ చేసింది. దానికి రానా ‘దొరికిన స్వర్గాల కంటే పోయిన స్వర్గాలే ఎక్కువ’ అని ఇన్‌డైరెక్టుగా తన మిస్సయిన లగేజ్ బ్యాగ్ గురించి ఒక సెటైర్ పేల్చాడు. ప్రస్తుతం ఇండిగో ఒక వింటర్ సేల్ ప్రకటించింది. 6వ తేదీలోపు రూ.2128 పెట్టి టికెట్స్ బుక్ చేసుకునేవారికి జనవరి 10 నుండి ఏప్రిల్ 13 వ తేదీ వరకూ దేశీయ ప్రయాణాలు చేయవచ్చని ప్రకటించగా దానికి కూడా రానా కౌంటర్ ఇచ్చాడు. ‘ఆ ఫ్లైట్ అసలు ఎగరదు, ఒకవేళ ఎగిరినా ల్యాండ్ అవ్వకపోవచ్చు, ఇక్కడ షెడ్యూల్ ప్రకారం ఏదీ జరగదు, అన్నిటికంటే ముఖ్యంగా మీ లగేజ్ గురించి వాళ్ళకి ఏమి తెలియదాని చెప్తారు ‘ అంటూ వరుసగా ఓ రేంజ్ లో కౌంటర్లు వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Share post:

Latest