క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన కీర్తి సురేష్.. అవసరం లేదంటూనే!

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ‘నేను శైలజ’ సినిమాతోనే కీర్తి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బేసిగ్గా మలయాళ బ్యూటీ అయినప్పటికీ ఇక్కడ జెండా పాతేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి అన్న సంగతి చాలామందికి తెలియదు. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

ఇక అసలు విషయానికొస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ అనేమాట వినబబడుతూ వస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఎందరో నటీమణులు స్పందించగా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి కీర్తి సురేష్ తాజగా స్పందించారు. తాజాగా కీర్తి సురేష్ KGF నిర్మాణ సంస్థలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న గురించి ఎదురైంది.

దానిగురించి ఆమె స్పందిస్తూ… కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తాము, లేదంటే లేదు అనే మాటలు తనకు ఎదురు కాలేదని. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆ అవసరం తనకి లేదని, వెంటనే ఇండస్ట్రీ నుంచి దూరమై ఏదైనా మంచి జాబ్ చేసుకుంటానని చాలా హుందాగా స్పందించింది. దాంతో యాంకర్ మరోసారి క్యాస్టింగ్ కౌచ్ లాంటివి నిజంగా ఇక్కడ ఉంటాయా? అని అడగగా ఉంటాయి… కానీ అందరూ అలా వుండరు. నిజంగా సినిమా తీయాలని అనుకునేవారు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయరు అని కుండబద్దలు కొట్టి చెప్పింది.

Share post:

Latest