హన్సిక పెళ్లి ఖర్చు అన్ని కోట్లా..?

టాలీవుడ్ లోకి మొదట దేశముదురు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన తను ప్రేమించిన వ్యక్తి, బిజినెస్ పార్ట్నర్ సోహైల్ ను వివాహం చేసుకొని బ్యాచిలర్ లైఫ్ను వీడింది. వీరి వివాహం జైపూర్ రాజస్థాన్లోని పురాతనమైనటువంటి ముంటోడ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇదంతా ఇలా ఉండగా హన్సిక కు సోహైల్ తో మొదటి వివాహం కాగా సోహైల్ కు ఇది రెండో వివాహం అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

INSIDE PICS: Hansika Motwani and Sohael Khaturiya celebrate their first pre- wedding ceremony in Mumbai | PINKVILLAఇక గతంలో సోహైల్, హన్సిక స్నేహితురాలని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చిన తర్వాత హన్సిక వివాహం చేసుకున్నట్లుగా వార్తల వినిపిస్తున్నాయి.సోహైల్ బిజినెస్ పార్టనర్ కావడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకువెళ్లిందని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరిద్దరి వివాహం మూడు రోజుల ముందు నుంచే చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.\All the stunning outfits Hansika Motwani wore for her wedding celebrations  with Sohael Khaturiya - India Today

హన్సిక తన వివాహం కోసం ఎంత ఖర్చు చేసింది అనే విషయంపై అభిమానులు ఆరా తీయగా.. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి కోసం దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం చాలా వైరల్ గా మారుతోంది.

Share post:

Latest