హనీమూన్ కోసం భారీ స్కెచ్ వేసిన హన్సిక.. ప్లాన్ అదిరిపోయింది గా..!!

హన్సిక మోత్వాని, సోహైల్ కథూరియా ఎట్టకేలకు జైపూర్ రాజకోటలో వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అవ్వడమే కాకుండా పెళ్లి దుస్తులలో హన్సిక, సోహైల్ దంపతులను చూసి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది స్టార్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. అంతేకాదు అలా పెళ్లయిందో లేదో ఇలా హనుమాన్ ప్లాన్స్ లేదా వెంటనే పిల్లల్ని కంటూ తల్లులవుతున్నారు. ప్రస్తుతం అదే బాటలో స్టార్ హీరోయిన్ హన్సిక కూడా వెళ్ళబోతోంది.

ఎంతోకాలంగా ప్రేమించినటువంటి వ్యక్తిని ఎట్టకేలకు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకుంది. అయితే ఈ హీరోయిన్ పెళ్లి , హనీమూన్ గురించి ప్రస్తుతం కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన హన్సిక మొదటి సినిమాతోనే సొట్టబుగ్గల సుందరిగా గుర్తింపు తెచ్చుకుంది . నవ్వితే బుగ్గన సొట్టతో తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె నటన, అందం ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేరు అని చెప్పవచ్చు. ప్రేమలో ఉంది.. వివాహం చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.. ఇంతలోనే తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ తో ప్రేమలో ఉన్నానని. అతను ప్రపోజ్ చేసిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఐ లవ్ యు అంటూ అఫీషియల్ గా తన ప్రేమను బయట పెట్టింది.

డెస్టినీ వెడ్డింగ్ జరుపుకున్న ఈ దంపతులు ఇప్పుడు హనీమూన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది . అయితే ఏ విషయంలోనైనా డిఫరెంట్ గా ఆలోచించే హన్సిక ఈసారి తన హనీమూన్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హన్సిక మూడు వారాలపాటు ఫారిన్ కంట్రీస్ లో హనీమూన్ కి వెళ్లాలని ప్లాన్ చేసిందట. ఈ క్రమంలోనే మొదట మాల్దీవులకు హనీమూన్ ప్లాన్ చేసిన హన్సిక .. కానీ అది నచ్చకపోవడంతో ఇటలీ, స్విజర్లాండ్ లో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి ఇది తెలిసిన తర్వాత అభిమానులు హన్సిక నటనలోనే కాదు జీవితంలో కూడా డిఫరెంట్ గా ఆలోచిస్తుందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.